అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బేగంబజార్‌లోని చుడీ బజార్ వద్ద నర్సుల సమక్షంలో ఆదిత్య శ్రీ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, తెరాస నాయకులు నందుకిషోర్ కొవ్వొత్తులను వెలిగించి ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు నివాళులర్పించారు.
అంతకు ముందు గోశామహల్ స్టేడియంలో పోలీస్ సిటీ సెక్యూరిటీ వింగ్ సిబ్బందికి, పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలంతా లాక్డౌన్ పాటించాలని నందుకిషోర్ ప్రజలను కోరారు. నియోజకవర్గంలో ఎవరూ ఆకలితో బాధపడకండా తమ ట్రస్ట్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండిః హైదరాబాద్‌ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..