ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. టైం వచ్చినప్పుడు NTR కూడా వస్తాడు: తారకరత్న - నందమూరి తారకరత్న

Nandamuri Taraka Ratna Entry in Politics : రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని సినీ నటుడు నందమూరి తారకరత్న చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏపీ సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి కావాల్సిందేనని అన్నారు.

Nandamuri Taraka Ratna Entry in Politics

author img

By

Published : Dec 19, 2022, 12:04 PM IST

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. టైం వచ్చినప్పుడు తారక్ కూడా వస్తాడు

Nandamuri Taraka Ratna Entry in Politics: రాబోయే రోజుల్లో ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తానని, టీడీపీకు అండగా నిలుస్తానని సినీ హీరో నందమూరి తారకరత్న చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మామయ్యకు అండగా నిలవాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ప్రజలకు మంచి చేసే ఆశయంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని, ఆయన వెన్నంటే ఉంటామని తెలిపారు..

"ఏ రోజు కూడా నందమూరి కుటుంబం పదవులు ఆశించలేదు. కేవలం ప్రజల కోసం పోరాడాతాం. ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. చంద్రబాబు మామయ్యను నేను నమ్ముతున్నాం. ఆయనకు ఎప్పుడూ అండగానే ఉంటాం. టైం వచ్చినప్పడు తమ్ముడు కూడా వస్తాడు. ఎప్పుడూ చెప్పలేం కానీ తప్పకుండా వస్తాడు." - హీరో నందమూరి తారకరత్న

జూనియర్ ఎన్టీఆర్ కూడా తనకు సమయం కుదిరినప్పుడు ప్రచారానికి వస్తారని చెప్పారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు సహకారం అందిస్తామని, కార్యకర్తలు కూడా కంకణం కట్టుకుని పోరాడాలని పిలుపునిచ్చారు. పాలపర్రులో నందమూరి తారకరత్నకు అభిమానులు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం ఎదురైంది. తారకరత్న రాకతో టీడీపీ నాయకులు, కార్యకర్తలలో ఉత్సాహం కనిపించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.