మైనర్ బాలికను అత్యాచారం కేసులో వ్యక్తికి నాంపల్లి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అడ్డగుట్ట బి సెక్షన్‌కు చెందిన చెంచు వినోద్ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. వినోద్ చెల్లి వద్దకు అదే బస్తీకి చెందిన బాలిక తరచుగా వచ్చేది. ఓ రోజు ఇంటికి వచ్చిన బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
2017 నుంచి ఈ కేసు విచారణ జరుగగా నాంపల్లి కోర్టు అతనికి శిక్ష విధించింది. 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రెండు వేల జరిమాన విధించింది. డబ్బులు కట్టని నేపథ్యంలో అధనంగా మరో మూడు నెలలు జైలు శిక్ష విధిస్తామని కోర్టు తీర్పు ఇచ్చింది.
ఇవీ చూడండి: 'పార్టీల కార్పొరేట్ డొనేషన్లపై నిషేధం విధించాలి'