కార్పొరేట్ ఫండింగ్‌కు బదులు పబ్లిక్ ఫండింగ్‌ను ప్రోత్సహించాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన మొత్తం కన్నా.. పెద్ద మొత్తంలో రాజకీయ పార్టీలు ఖర్చు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్లు పెద్ద మిస్టరీ అని.. పెద్ద పార్టీలు ఎన్నికలకు చేసే ఖర్చు వల్ల.. చిన్న పార్టీలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అసద్ పేర్కొన్నారు. పారదర్శకంగా పార్టీ నిర్వహణ సాధ్యం కాదని.. రాబోవు రోజుల్లో రాజకీయపార్టీలు పేపర్‌కే పరిమితవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'హైదరాబాద్ విషయంలో అలాంటి ప్రతిపాదనే లేదు'