ETV Bharat / state

Nampally Court Granted Bail to Shivaram : ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడికి బెయిల్‌ - Court Judgement on Pravallika Suicide Case

Shivaram Brother Reaction on pravallika Suicide : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ప్రవళిక ఆత్మహత్య కేసులో మలుపు తిరిగింది. నిందితుడు శివరాం రాథోడ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శివరాంపై సరైన ఆధారాలు లేకపోవడంతోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

pravallika Suicide Case Update
Shivaram Brother Reaction on pravallika Suicide Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2023, 5:03 PM IST

Shivaram Brother Reaction on pravallika Suicide : ప్రవళిక ఆత్మహత్య కేసు(Pravallika suicide case)లో విచారణ మరో మలుపు తిరుగుతుంది. తాజాగా పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు శివరాం రాథోడ్‌పై ఎలాంటి ఆధారాలు లేవన్న కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నిన్న సాయంత్రం శివరాంను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తర్వాత శివరాంను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయస్థానం.. నిందితునిపై సరైన ఆధారాలు లేవని ప్రకటించింది. రూ.5వేల వ్యక్తిగత పూచికత్తుపై నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

pravallika Suicide Case Update : ఈ కేసులో పోలీసులు తమ సోదరుడిని ఇరికించారని శివరాం సోదరుడు మునిరామ్‌ రాథోడ్‌(Muniram Rathode) ఆవేదన వ్యక్తం చేశాడు. శివారంను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని.. అతనికి ఎలాంటి సంబంధం లేదన్నాడు. ప్రవళికకి, తన అన్నయ్యకు ఎలాంటి పరిచయాలు లేనప్పటికీ ప్రచారం మాధ్యమాల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో.. తాము ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నామని మునిరామ్ స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులుగా శివరాం కూడా కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకుండా భయంతో వేరే ప్రాంతాలకు వెళ్లిపోయాడని అన్నాడు. ఈ ఘటన జరిగిన విషయం తెలుసుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యాడని.. పోలీసులు ఒత్తిడి చేయడంతో తన సోదరుడు కోర్టులో లొంగిపోయాడని వివరించాడు.

Pravalika Suicide Accused Shivaram Arrest : ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం అరెస్ట్

Shivaram Rathod Family Petition : పోలీసుల వేధింపులు అధికమయ్యాయని.. సాక్ష్యాలు ఏమున్నాయో ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని శివరాం సోదరుడు వ్యాఖ్యానించాడు. పోలీసుల దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నారని.. ఉంటే తమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని ప్రశ్నించాడు. ఈ కేసును పోలీసులు తారుమారు చేస్తున్నారని ఆరోపించాడు. ఇప్పటికే తమ కుటుంబ సభ్యలను వేధిస్తున్నారని రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు శివరాం(Shivaram Rathode) గురించి తెలపాలని వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Court Judgement on pravallika Suicide Case : శివరాం నిన్న నాంపల్లి కోర్టు(Namally Court) ముందు శుక్రవారం లొంగిపోయాడు. నిందితుడు తరుఫు న్యాయవాది మోమో దాఖలు చేశారు. శివరాం రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు కూడా పిటిషన్‌ వేయగా కోర్టు విచారించింది. కేవలం వాట్సప్ చాట్ ఆధారంగా రిమాండ్ ఇవ్వలేమని విడుదల చేసింది. బయటకు వచ్చిన శివరాంను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హజరుపరిచారు. న్యాయస్థానం మళ్లీ వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

Nampally Court Rejected Sivaram Remand Petition : ప్రవళిక ఆత్మహత్య కేసు నిందితుడిని విడుదల చేసిన కోర్టు.. మళ్లీ అరెస్ట్​

KTR Reacts on Pravaika Incident : ప్రవళిక మరణంపై స్పందించిన కేటీఆర్.. కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్న మంత్రి

Family Members Reaction on Pravalika Suicide : 'శివరామ్ వల్లే ప్రవళిక చనిపోయిందన్న కుటుంబసభ్యులు.. చిక్కడపల్లి పీఎస్​లో కేసు నమోదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.