ETV Bharat / state

'సీఎం కేసీఆర్​​ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు' - నల్లు ఇంద్రసేనా రెడ్డి

సీఎం కేసీఆర్​ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. కాబ్​పై కాంగ్రెస్, తెరాసలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

nallu indrasenareddy fair on trs in Hyderabad
'కేసీఆర్​ యూనియన్​ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు'
author img

By

Published : Dec 21, 2019, 9:44 AM IST

సీఎం కేసీఆర్​ రాష్ట్రంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీలు, జీహెచ్ఎంసీ, అంగన్​వాడీ, ఆర్టీసీలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. యూనియన్లను రద్దు చేయాలనుకోవటం వ్యవస్థలను నిర్వీర్యం చేయాలనుకోవటంలో భాగమేనన్నారు.

సీఎంతో కాకుండా.. కేంద్రం కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడతామంటే కుదురుతోందా అని ప్రశ్నించారు. కార్మికుల సంక్షేమం కోసం.. బ్రిటిష్ కాలంలోనే యూనియన్లు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. కార్మికులపై కేసీఆర్ వ్యతిరేక ధోరణిని ఖండిస్తున్నామన్నారు.
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ పత్రికా ముఖంగా చెప్పగలరా అని నల్లు ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు. కాబ్​పై కాంగ్రెస్, తెరాసలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కొన్ని పాఠశాలలు సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులకు నూరిపోస్తోన్న విషయం మా దృష్టికి వచ్చిందని... అలాంటి పాఠశాలలపై దేశ ద్రోహం కేసులు పెడతామని నల్లు హెచ్చరించారు.

'సీఎం కేసీఆర్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు'

ఇవీ చూడండి: 'తెలంగాణ నూటికి నూరు శాతం లౌకిక రాష్ట్రం'

Tg_hyd_32_20_nallu_pc_on_caa_ab_3182061 రిపోర్టర్: జ్యోతికిరణ్ Note: feed from bjp ofc ( ) కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీలను, జీహెచ్ఎంసీ, అంగన్ వాడీ, ఆర్టీసీలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. యూనియన్లను రద్దు చేయాలనుకోవటం వ్యవస్థలను నిర్వీర్యం చేయాలనుకోవటంలో భాగమేనన్నారు. ప్రణాళిక ప్రకారమే యూనియన్లు లేకుండా.. ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశమయ్యారని తెలిపారు. సీఎంతో కాకుండా.. కేంద్రం కూడా ఎమ్మెల్యేలతోనే మాట్లాడతామంటే కుదురుతోందా అని ప్రశ్నించారు. కార్మికుల సంక్షేమం కోసం.. బ్రిటీష్ కాలంలోనే యూనియన్లు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. కార్మికులపై కేసీఆర్ వ్యతిరేక ధోరణిని ఖండిస్తున్నామన్నారు.CAA ను వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ పత్రికా ముఖంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. CAA పై కాంగ్రెస్, తెరాసలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని పాఠశాలలు CAAకు వ్యతిరేకంగా విద్యార్థులకు నూరిపోస్తోన్న విషయం మా దృష్టికి వచ్చిందని...అలాంటి పాఠశాలలపై దేశ ద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు......Byte బైట్: నల్లు ఇంద్రసేనా రెడ్డి, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.