హైదరాబాద్ ముషీరాబాద్‌లోని విద్యానగర్ చౌరస్తా, రాంనగర్ ఈ సేవ వద్ద మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించారు. సభలకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై నాయినికి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నాయిని నర్సింహారెడ్డి కార్మిక నేతగా వేలాది మంది కార్మికులకు మార్గదర్శిగా నిలిచాడని అన్నారు. కార్మికవర్గం, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పలు సమస్యలకు పరిష్కారాలు... ఆ యువకుడి రూపకల్పనలు