ఆంధ్రప్రదేశ్లోని నాగావళిలో వరదనీటి ప్రవాహం పెరిగింది. దీంతో విజయనగరం జిల్లా కొమరాడ మండలం నాగావళి నదికి అటువైపు ఉన్న గ్రామస్థులు ఇటువైపు రావాడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల ఇక్కట్లు వర్ణనాతీతం. ప్రస్తుతం కొమరాడ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కొట్టు, తొడుము గ్రామాల మధ్యగా నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది దాటితేనే విద్యార్థులకు చదువులు. వానొచ్చినా, వరదొచ్చినా ఇదే పరిస్థితి. ఆయా గ్రామాల విద్యార్ధులు కొమరాడ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఇంటర్, డిగ్రీ చదువులకు పార్వతీపురం వెళ్లాలి. గత నాలుగు రోజులుగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంగా విద్యార్థులు ఇలా నదిలో దిగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. వానకాలమంతా ఇదే పరిస్థితి ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు.
ఇవీ చూడండి: భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ