ETV Bharat / state

నాన్న ఇక లేడని.. ఎప్పటికీ రాడనీ...! - నాన్న ఇక లేడని.. ఎప్పటికీ రాడనీ...!

ముద్దులతో గారాలు చేసే నాన్న ఎందుకు పడుకున్నాడో తెలియదు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. ఎప్పుడూ చాక్లెట్లు ఇచ్చే నాన్న స్నేహితులు పూలెందుకు తెచ్చారో..! ఇదీ తన తండ్రి వీరమరణం పొందాడని తెలియని ఓ చిన్నారి తీరు. ఆ పసివాడి ప్రవర్తన అందరినీ కంటతడి పెట్టించింది. ఉద్వేగం ఆపుకోలేకపోయిన ఓ అధికారి అతణ్ని పక్కకు తీసుకెళుతూ కన్నీటి పర్యంతమవటం హృదయాలను కలచివేస్తోంది.

నాన్న ఇక లేడని.. ఎప్పటికీ రాడనీ...!
author img

By

Published : Jun 18, 2019, 7:02 PM IST

జమ్ముకశ్మీర్‌లో జూన్‌ 12న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో అనంతనాగ్‌లోని సర్దార్‌ పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అర్షద్‌ ఖాన్‌ ఒకరు. అర్షద్‌ దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. ఆదివారం తుదిశ్వాస విడిచారు.

కన్నీటి నివాళి..
అర్షద్‌ మృతదేహాన్ని సోమవారం శ్రీనగర్‌కు తరలించారు. అక్కడ గవర్నర్‌తోపాటు పలువురు సైనికాధికారులు, పోలీసు అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అర్షద్‌ ఖాన్‌ నాలుగేళ్ల కుమారుణ్ని ఎత్తుకొని పోలీసు ఉన్నతాధికారి హసీబ్‌ మొఘల్‌ నివాళి అర్పింపజేశారు. ఈ క్రమంలో ఆ చిన్నారిని చూసి ఉద్వేగం ఆపుకోలేక పోయిన హసీబ్‌ అతణ్ని పక్కకు తీసుకెళుతూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మనసుల్ని ద్రవిపజేస్తోంది .

ఇదీ చదవండీ: పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో అదరగొట్టిన విన్యాసాలు

Intro:ap_tpg_81_18_polavarmkudikaluva_ab_c14

Body:పోలవరం కుడి కాలువ పనులు ఈ ఏడాది వాతావరణం అనుకూలించిన నత్తనడకన సాగుతున్నాయి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల పరిధిలో పనులు మందకొడిగా సాగుతున్నాయి దీనికి సకాలంలో బిల్లులు చెల్లింపు లేకపోవడంతో పాటు ఇసుక కొరత కారణంగా ఈ పరిస్థితి నెలకొని ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు 177.9 కిలోమీటర్ల పొడవునా లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా ఇంకా 17 కిలో మీటర్లు మిగిలి ఉంది . 7.48 కిలోమీటర్లు సంబంధించి పనులు జరుగుతున్నాయి 9. 5 7 9 కిలోమీటర్ల పొడవునా పనులు మొదలు పెట్టలేదు 255 structures గాను 209 నిర్మాణ పనులు పూర్తయ్యాయి 28 పనులు జరుగుతుండగా 16 పనులు మొదలు పెట్టలేదు ఆయా ప్రాంతాల్లో సాగునీటిని అందించడానికి 31 తూముల నిర్మించాల్సి ఉండగా కొన్ని మాత్రమే పూర్తయ్యాయి ఎన్నికల కోడ్ ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు చెల్లింపు లేకపోవడం ఇసుక కొరత తదితర కారణాలతో పనులు ఆలస్యం అయ్యాయి కుడికాలువ పనుల అంచనా 4375 కోట్లు కాగా ఇప్పటివరకు 3780 కోట్ల విలువైన పనులు చేయడం జరిగింది కుడి కాలువకు నీటి విడుదల చేసే అవకాశం ఉండటంతో మరికొద్ది రోజుల్లో పనులు నిలిచిపోనున్నాయి దీనిపై ఎస్ ఈ వీరాకుమార్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ బిల్లులు చెల్లింపు లేకపోవడంతో తదితర కారణాలతో పనులు ఆశించి న స్థాయిలో జరగలేదన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.