Mynampally Joins Congress Today : వచ్చే శాసనసభ ఎన్నికల్లో(Telangana Assembly Election 2023) రాష్ట్రంలో ఎలాగైనా విజయం సాధించి.. తమ బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ(Congress) భావిస్తోంది. అందులో భాగంగా వివిధ పార్టీల నుంచి వచ్చిన చిన్నాపెద్దా నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోకి చేరికలు జోరుగానే కొనసాగుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు నేతలతో పాటు వారి అనుచరగణం హస్తం పార్టీలో చేరనున్నారు.
Vemula Veersham Joins Congress Today : ఇప్పటికే కొంత మంది నాయకులు దిల్లీ(Delhi) చేరుకోగా.. ఉదయం మరికొందరు హస్తిన చేరుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ ఎమ్మెల్యే మేముల వీరేశం, ఆరేపల్లి మోహన్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌తో పాటు భువనగిరికి చెందిన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. వారు కాకుండా మరో 10 నుంచి 12 మంది రెండు పార్టీల నుంచి వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పార్టీలో చేరే నేతల సంఖ్య కూడా పెరుగుతోంది.
Telangana Assembly Election Congress Plan 2023 : దిల్లీలోనే మకాం వేసిన నేతలు : ఇప్పటికే టికెట్లు ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు దిల్లీలోనే మకాం వేసి.. ఏఐసీసీ ముఖ్య నేతలు, రాష్ట్ర నేతల వద్ద తమ ఆఖరి ప్రయత్నాలను చేస్తున్నారు. బీసీ కోటాలో సీట్లు కేటాయించాలని మునుగోడు నుంచి పున్న కైలాశ్ నేత, పెద్దపల్లి నుంచి గంట రాములు యాదవ్, గద్వాల నుంచి డాక్టర్ కురవ విజయ్ వినతి పత్రాలు ఇచ్చారు.
Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్, షెడ్యూల్
Telangana Assembly Election 2023 : మరోవైపు కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో తీవ్రంగా నిమగ్నమైంది. దీంతో పార్టీలో, బయట తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దాదాపుగా ఓ కొలిక్కి తీసుకువచ్చింది. ఈ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. దాదాపుగా మొత్తం 80కు పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చింది.
ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను నేడు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని నిర్ణయించారు. ఆ తర్వాత అక్కడ అనుమతి లభిస్తే.. ఈ నెలాఖరుకు లేదా అక్టోబరు మొదటి వారంలో 80కిపైగా స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. మరో 20 స్థానాల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనూ సామాజిక సమతౌల్యం పాటించాలని అనుకోవడంతో స్క్రీనింగ్ కమిటీ ఏ నిర్ణయానికి రాలేకపోతుంది.
Congress Ticket War in Palamuru : ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ టికెట్ దక్కించుకునేదెవరు..?