బెంగళూర్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో జరిగిన ఐటీ దాడుల్లో భాగంగానే.. మై హోమ్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించినట్లు మై హోమ్ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. బెంగళూర్ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో ఓ ప్రాజెక్టులో ఉమ్మడిగా వ్యాపారం చేస్తున్నట్లు మైహోమ్ తెలిపింది. ఐటీ అధికారులు కోరిన పూర్తి సమాచారాన్ని అందించినట్లు మై హోం యాజమాన్యం తెలిపింది. వ్యాపార కార్యకలాపాలన్నీ విలువలకు, నియమాలకు లోబడి సాగుతున్నాయని.... కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను పాటిస్తున్నట్లు తెలిపారు. పన్ను చట్టాలను, నియంత్రణా సంస్థల నిబంధనలను పాటిస్తున్నట్లు మై హోమ్ గ్రూప్ వెల్లడించింది.
ఇవీ చూడండి: టీఆర్టీ నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా