ఏపీ ప్రకాశం జిల్లా మార్టూరు పట్టణం గన్నవరం రోడ్డులో ఓ వ్యక్తి గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కరోనా సమయం కావటంతో ఎవరూ పట్టించుకోలేదు. కడసారి చూసేందుకు కూడా బంధువులు రాలేదు. ఆ సమయంలో మజ్లిస్ పార్టీ యువకులు మీకు అండగా మేమున్నామంటూ ముందుకొచ్చారు.
కుల మతాలకు అతీతంగా దహస సంస్కారాలు నిర్వహించారు. ఆ నలుగురు చేసిన ఉపకారానికి ముస్లిం యువకులకు మృతుని కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. మజ్లిస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, నేతలు సనాఉల్లా బాషా, మహహ్మద్ గని, సాద్ భాయ్, ముక్తుమ్ బాషా, జాఫర్, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.