ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును కోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో పాటు.. ఇతరుల ప్రచారం అడ్డుకున్నారన్న అభియోగంపై కేసు న్యాయస్థానంలో వీగిపోయింది.
ఇవాళ వేరువేరు కేసుల్లో మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కోర్టుకు హాజరయ్యారు. జుబ్లీహిల్స్‌లో నమోదైన బెదిరింపుల కేసులో ఈనెల 19న విచారణకు హాజరు కావాలని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.
ఇదీ చదవండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీపీ అంజనీకుమార్ టగ్ ఆఫ్ వార్