సమాజంలోని అభాగ్యులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిదాయూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ అనాథాశ్రమంలోని విద్యార్థినిలకు పండ్లను పంపిణీ చేశారు.
బాలికలు మంచిగా చదువుకొని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఆశ్రమంలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొని రావాలని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని మరింత విస్తృత పరచాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు.