హైదరాబాద్ ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రంలో టీకా కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ కేంద్రానికి ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన రాంనగర్, కవాడిగూడ, ముషీరాబాద్, అడిక్మెట్, గాంధీ నగర్, భోలక్పూర్ డివిజన్లకు చెందిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ విషయం ప్రజలకు తెలియకపోవడం కారణంగా ఈ కేంద్రం వెలవెల బోయింది.
ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ప్రజలు వచ్చినప్పటికీ… ప్రభుత్వం ఆశించిన మేరకు వ్యాక్సినేషన్(vaccination) లక్ష్యాన్ని చేరుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్ల కోసం వ్యాక్సిన్(super spiders vaccination) వేయడానికి పెద్ద ఎత్తున కేంద్రాలు ఏర్పాటు చేసినా… ఆ విషయంపై ఆయా వర్గాలకు సమాచారం చేరలేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: Investigation : రాష్ట్రంలో వ్యాక్సిన్ల వృథాపై విజిలెన్స్ విచారణ