ETV Bharat / state

Corporators protest: ప్రొటోకాల్ పాటించట్లేదంటూ కార్పొరేటర్ల ఆందోళన - ముషీరాాబాద్​లో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ప్రభుత్వ కార్యక్రమాల గురించి తమకు సమాచారం ఇవ్వకుండా, ఫ్లెక్సీల్లో తమ ఫొటోలు వేయకుండా ప్రొటోకాల్​ను ఉల్లంఘిస్తున్నారంటూ ముషీరాబాద్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు.

musheerabad corporators protest for officials not following the protocal
ప్రొటోకాల్ పాటించట్లేదంటూ కార్పొరేటర్ల ఆందోళన
author img

By

Published : Jun 11, 2021, 2:13 PM IST

ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ గురించి తమకు సమాచారం ఇవ్వడం లేదంటూ హైదరాబాద్​లోని ముషీరాబాద్ నియోజకవర్గ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. అలాగే ఫ్లెక్సీలపై తమ ఫొటోలను కూడా వేయట్లేదని అన్నారు. ముషీరాబాద్ అన్ని డివిజన్లలోని కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు రామ్ నగర్​లోని ఎస్ఆర్టీ కమ్యూనిటీ హాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించకుండా.. ఫ్లెక్సీలపై తమ ఫోటోలను కూడా ఏర్పాటు చేయకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కావాలానే తమను అగౌరవ పరుస్తున్నారని కార్పొరేటర్లు వాపోయారు. చెక్కుల పంపిణీ జరుగుతున్న కమ్యూనిటీ హాల్ ఎదుటనే నిరసన చేశారు. నినాదాలతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్... మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చారు. ప్రొటోకాల్ పాటించేలా అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాటతో శాంతించిన కార్పొరేటర్లు వేదికపైకి వెళ్లారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.