ETV Bharat / state

మీ నిర్ణయమే ఫైనల్.. అలా అయితేనే పోటీ చేస్తా: రాజగోపాల్ రెడ్డి - మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి

Rajagopal Reddy: రానున్న 10-15 రోజుల్లో కేసీఆర్​పై యుద్ధం ప్రకటిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్​ భావిస్తే ఉప ఎన్నిక రాదని.. ప్రజలు సిద్ధంగా ఉంటే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి పిలుపు వచ్చినా.. ప్రస్తుత తరుణంలో రాలేనని సమాధానమిచ్చారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
author img

By

Published : Jul 30, 2022, 2:35 PM IST

Updated : Jul 30, 2022, 8:33 PM IST

Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ వేర్వేరుగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఉత్తమ్‌, వంశీచంద్‌తో భేటీ అనంతరం రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి పిలుపొచ్చింది. అయితే నియోజకవర్గ పర్యటన తర్వాత దిల్లీకి వస్తానని రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నందున రాలేనని రాజగోపాల్ రెడ్డి అధిష్ఠానానికి వివరించారు.

మునుగోడు అభివృద్ధి కావాలంటే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. నా రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందితే సంతోషమేనని వెల్లడించారు. ప్రజల అభిప్రాయం ప్రకారమే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు 15 రోజుల్లో నిర్ణయం చెప్పాలని కోరారు. ఉపఎన్నికలోనూ ప్రజలు పోటీ చేయమంటేనే చేస్తానని తెలిపారు. మునుగోడు ప్రజలు నా వెంటే ఉన్నారన్నారు. నా గెలుపుతో కేసీఆర్‌ పతనానికి నాందీ పలుకుతానని పేర్కొన్నారు. మునుగోడు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టులా ఉండాలన్నారు.

మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని రాజగోపాల్​రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ భావిస్తే ఉప ఎన్నిక రాదని.. ప్రజలు సిద్ధంగా ఉంటేనే వస్తుందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తామన్నారు. ఇది పార్టీల మధ్య యుద్ధం కాదని.. కేసీఆర్​ కుటుంబానికి, ప్రజలకు మధ్య జరిగే యుద్ధమని అభివర్ణించారు. అభివృద్ధిని కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్​కే పరిమితం చేశారన్న రాజగోపాల్​రెడ్డి.. కేసీఆర్​కు బుద్ధి చెప్పే ఎన్నిక వస్తుందన్నారు. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానన్నారు. ఈ క్రమంలోనే తన రాజీనామా గురించి అమిత్​ షాతో మాట్లాడలేదని రాజగోపాల్​రెడ్డి స్పష్టం చేశారు.

‘‘మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలి. కేసీఆర్‌ భావిస్తే ఉపఎన్నిక రాదు. ప్రజలు సిద్ధంగా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది. రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తాం. ఇది పార్టీల మధ్య యుద్ధం కాదు. కేసీఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్య జరిగే యుద్ధం. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా.’’-రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

మరోవైపు కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరే అంశంపై మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మూడు రోజుల పాటు భేటీ నిర్వహించిన రాజగోపాల్‌రెడ్డి... వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎదురయ్యే ఉప ఎన్నిక.. పరిణామాలు, నియోజకవర్గంలో పార్టీల పరిస్థితులపై ఆయన చర్చించారు. రాజగోపాల్‌రెడ్డి విషయమై ఆయన సోదరుడు దిల్లీలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో.. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై.. గంటన్నరకు పైగా చర్చించారు. ఎంపీ వెంకట్‌రెడ్డి సైతం రాజగోపాల్‌రెడ్డి తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన కాంగ్రెస్‌లో కొనసాగేలా చూసేందుకు ప్రయత్నిస్తానని వెంకట్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం.

అధిష్ఠానం పిలుపు: కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి పిలుపొచ్చింది. వెంటనే దిల్లీకి రావాలని అధిష్ఠానం తెలిపింది. అయితే నియోజకవర్గ పర్యటన తర్వాత దిల్లీకి వస్తానని రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి అధిష్ఠానానికి వివరించారు. పార్టీ వైపు నుంచి తనకు జరిగిన అన్యాయాలను వారి ఎదుట పెట్టినట్లు తెలుస్తోంది. తాము కోమటిరెడ్డి సోదరులం కాంగ్రెస్‌ పార్టీకి విధేయులమని...ఆలాంటి వారైన తమకు పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిందని రాజగోపాల్‌ రెడ్డి తెలియచేసినట్లు సమాచారం.

సీఎల్పీ పదవి తనకు వస్తాదని భావించగా...ఆ పదవి భట్టి విక్రమార్కకు ఇచ్చారని ఆ తరువాత పీసీసీ పదవి తమకు వరిస్తుందని ఆశించామని వివరించారు. అది కూడా తమకు దక్కలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ పదవి బయట నుంచి పార్టీలోకి వచ్చిన వ్యక్తికి ఇచ్చారని వాపోయినట్లు తెలుస్తోంది. ఇలా అంశాల వారీగా తమకు పార్టీలో జరిగిన అన్యాయాలపై రాజగోపాల్‌ రెడ్డి ఎకరువు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికి కూడా తను కాంగ్రెస్‌ వాదినేనని...కాంగ్రెస్‌ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఉన్నత స్థాయి నుంచి తమకు దిల్లీ రావాలని కబురు అందుతోందని పేర్కొన్న రాజగోపాల్‌ రెడ్డి ఇప్పటికిప్పుడు వెళ్లలేనని ఆయన వివరించారు.

ఇవీ చూడండి..

'రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడరు.. ఉపఎన్నిక రాదు'

'న్యాయాన్ని ప్రతి గడపకు చేర్చాలి.. ఎందరో మౌనంగా బాధపడుతున్నారు'

Last Updated : Jul 30, 2022, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.