ETV Bharat / state

'ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయండి' - దానకిశోర్ అధికారులకు సూచనలు

Municipal Chief Secretary Review Meeting on Prajapalana : 'ప్రజా పాలన' సన్నద్ధతపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్డు సభలకు ఏర్పాట్లు చేయాలని, దరఖాస్తుల స్వీకరణ, రసీదు, కంప్యూటరీకరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Danakishore Instructions to Officers
Municipal Chief Secretary Review Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 9:56 PM IST

Municipal Chief Secretary Review Meeting on Prajapalana : ప్రజాపాలనలో భాగంగా ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్డు సభలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు హరిచందన, అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు. ప్రజాపాలన సన్నద్ధతపై సమీక్షించారు. ఓఆర్ఆర్ పరిధిలోని కమిషనర్లు ప్రత్యక్షంగా, మిగిలిన వారు జూమ్‌లో సమావేశానికి హాజరయ్యారు.

Dana kishore Meeting with Officers : వార్డు సభలకు ఏర్పాటు చేసి, బృందాలను పూర్తి చేయాలని ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, వాటికి రసీదు ఇవ్వడం, కంప్యూటరీకరణ చేయడం తదితర అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డు సభల తేదీలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. కార్యక్రమంపై రోజు వారీ నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. దీనికి అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

మరో కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం - ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన'

Praja Palana Fund Released by CM : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy Meeting with Collectors) జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా గ్రామాల్లోకి వెళ్లి వినతులు స్వీకరించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం కోసం రూ.25 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ నిధులతో సభల్లో మంచి నీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

Praja Palana Arrangements Review Meeting : ఆరు గ్యారంటీలకు సంబంధించి వినతులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేషన్‌కార్డు ప్రాతిపధికగా చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 28 నుంచి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఈ లోపు అర్హులైన వారు అప్లికేషన్‌ పెట్టుకోకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించిన దగ్గర నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిజమైన అర్హులకు పథకాలు అందేలా చేస్తామని అన్నారు. ఇప్పటికే ఆరింటిలో రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme in Telangana) ద్వారా మహిళల నుంచి మంచి ఆదరణ వస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్‌రెడ్డి సమావేశం - ప్రజాపాలన, ఆరు గ్యారంటీల అమలుపై చర్చ

Prajapalana in Nalgonda : ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి మంగళవారం నల్గొండ ఎంఎన్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా అధికారులు హజరుకానున్నారు. సమావేశంలో ప్రజాపాలన అంశంపై మంత్రులు అవగాహన కలిపిస్తారు.

6 గ్యారంటీల కోసం ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ : మంత్రి పొంగులేటి

అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.