ETV Bharat / state

పురపాలికల్లో 'వ్యర్థ' ప్రక్షాళన - GOVERNAMENT

పురపాలికల్లో వ్యర్థాల సేకరణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్, ఎరువుల తయారీకి ఏర్పాట్లు చేస్తోంది. జపాన్ ఆర్థిక, సాంకేతిక సహకారంతో నివేదికలు రూపొందించింది. స్వచ్ఛ భారత్​ నిధులతోపాటు, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ప్రాజెక్టులు సిద్ధం చేస్తోంది.

చెత్త నుంచి విద్యుత్​చ్ఛక్తి...
author img

By

Published : Feb 13, 2019, 4:26 PM IST

చెత్త నుంచి విద్యుత్​చ్ఛక్తి...
పట్టణాలు, నగరాల్లో ఘనవ్యర్థాల సమగ్ర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా కార్పొరేషన్లు, పురపాలికల్లో చెత్త సేకరణకు పటిష్ట వ్యవస్థకు కార్యాచరణ తయారుచేస్తోంది. ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మౌలిక వసతులకు కేంద్ర కేటాయింపులతోపాటు 20శాతం స్వచ్ఛ భారత్ నిధులు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. వ్యర్థాల నుంచి ఇందన ఉత్పత్తి చేయనుంది. భస్మీకరణ ప్లాంట్లను ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన పురపాలికల్లోనూ దశల వారీగా అమలు చేయబోతోంది.
undefined
హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 72 కార్పోరేషన్లు, పురపాలక సంఘాల్లో అమలుకు పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇళ్ల నుంచి చెత్త సేకరణ, తరలింపుతో పాటు పారబోత వంటి అంశాలతో సమగ్ర విధానాన్ని రూపొందించనున్నారు. ఇప్పటికే వరంగల్, సూర్యాపేట, సిద్దిపేట, సిరిసిల్ల, భువనగిరి, షాద్​నగర్​లో డంపింగ్ యార్డ్​, వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సిద్ధిపేటలో వ్యర్థాల నిర్వహణకు గ్రీన్ రిసోర్స్ పార్కు ఏర్పాటు చేశారు. రోజూ దాదాపు ఎనిమిది మెట్రిక్ టన్నుల వ్యర్థాల నుంచి రెండు మెట్రిక్ టన్నుల వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. స్వయం సహాయక బృందాలు, రైతులకు విక్రయించి ఆదాయం సమకూర్చుకునే అవకాశాన్ని కల్పించారు. పురపాలికల్లో చెత్త సేకరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో డ్రైవర్ కమ్ ఓనర్ విధానంలో ఆటోలు సమకూర్చారు. ఘన వ్యార్థాల నిర్వహణకు సిద్దిపేట పురపాలికకు స్కోచ్ అవార్డు లభించింది.
ఇప్పటికే వివిధ మార్గాల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతతో వ్యర్థాలను భస్మీకరణం చేసి జపాన్ తరహా విధానంలో విద్యుత్ తయారు చేయాలని నిర్ణయించింది. వరంగల్​, బీబీనగర్​లో పర్యటించిన జపాన్ అధికారుల బృందం సాంకేతిక సహకారాన్ని అందించేందుకు అంగీకరించింది. మొదటి దశలో హైదరాబాద్, వరంగల్​ తర్వాత ఒక్కొక్కటి చొప్పున భస్మీకరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.