రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో ఆక్రమనిర్మాణలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపించారు. గతంలో గ్రామ పంచాయతీల పేరుతో అనుమతులు పొంది అదే పేరుతో బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వాటిని కూల్చేశారు. యజమానులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరించారు.
నోటీసులిచ్చినా స్పందించలేదు
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 40 భవనాలకు గ్రామ పంచాయతీల పేరుతో తీసుకున్న అనుమతులు చెల్లవంటూ గతంలో నోటీసులిచ్చినా... నిర్మాణ దారులు స్పందించలేదని అధికారులు తెలిపారు. జీవో 111 అమలులో ఉన్నందున అక్రమ లే అవుట్ల నిర్మాణం చేపడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇలాంటి నిర్మాణాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శంషాబాద్ పరిధిలో ప్లాట్లకు అనుమతులు ఉండవని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : జలకళ సంతరించుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలాశయాలు