ETV Bharat / state

నిందితుడు లేడు... నిజం తేలేదెలా!?

తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సురేశ్​... మూడు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసు బందోబస్తు నడుమ స్వగ్రామం గౌరెల్లికి తరలించారు. ఈరోజే అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

MRO MURDER CASE ACCUSED SURESH DIED... BUT CASE NOT SOLVED...
author img

By

Published : Nov 7, 2019, 10:09 PM IST

నిందితుడు చనిపోయాడు... మరి నిజాలు తేలేదెప్పుడు?

అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ వియజారెడ్డిని సజీవదహనం చేసిన కేసులో తీవ్ర గాయాలపాలైన నిందితుడు మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో మూడురోజులుగా సురేశ్ చికిత్స పొందుతున్నాడు. నిన్నరాత్రి నుంచి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండగా... వెంటిలేటర్​పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

స్వగ్రామానికి సురేశ్ మృతదేహం...

పోలీస్​ బందోబస్తు నడుమ మృతదేహాన్ని గౌరెల్లికి తరలించారు. తన కొడుకు ఎప్పుడూ... తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళలేదని సురేశ్ తండ్రి కృష్ణయ్య తెలిపారు. అసలు ఈ హత్య ఎందుకు చేశాడనేది తమకు అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ మూడు ఎకరాల భూమిలోని 9 గుంటల స్థలాన్ని మల్‌రెడ్డి రాంరెడ్డికి అమ్మినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో నిందితుడు కూడా మృతి చెందటం వల్ల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బంధువులు ఆరోపిస్తున్నట్లు సురేష్​ను ఈ హత్యకు ఎవరైనా ఉసిగొల్పారా... లేక ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడా... అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ కాల్ డేటా ఆధారంగా మిగిలిన వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్​ మృతి

TG_HYD_63_07_SURESH_DEATH_PKG_3182400 note: ఆర్ ఎమ్ ఓ బైట్ డెస్క్ వాట్సప్ కి పంపాము ( )తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ ఇవాళ సాయంత్రం మృతి చెందాడు. పెట్రోల్‌ పోసి నిప్పంటించే క్రమంలో సురేష్‌కు కూడా మంటలు అంటుకుని ఆతను తీవ్రంగా గాయపడి గత మూడు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో ఆయనకు గత రాత్రి నుంచి వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందించారు. సాయంత్రం మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అనంతరం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసు బందోబస్తు నడుమ మృత దేహాన్ని సురేష్ స్వగ్రామం గౌరెల్లికి తరలించారు. మృత దేహానికి ఈ రోజే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. ఎంటువంటి అవాఛనీయ ఘటనలు జరగ కుండా గౌరెల్ల గ్రామంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. వాయిస్ ఈ నెల 4న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ వియజా రెడ్డి పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కేసులో తీవ్ర గాయాలపాలైన నిందితుడు కూర సురేష్ ఈ ఉస్మానియా ఆస్పత్రిలో ఈ మధ్యహ్నం 3.25 గంటలకు మృతి చెందాడు. నిన్న రాత్ర నుంచి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అతిని అరోగ్య పరిస్థిత అత్యంత విషమించటంతో మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. బైట్: డా.రఫి, ఉస్మానియా ఆర్ ఎమ్ ఓ వాయిస్ మరో వైపు సురేష్ అంత్యక్రయలు నిర్వహిస్తామని తండ్రి కృష్ణయ్య తెలిపారు. సురేష్ ఎప్పుడూ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్ళలేదని...అసులు ఈ హత్య ఎందుకు చేశాడు తమకు అర్థం కావట్లేదని వివరించారు. తమ అన్నదమ్ములకు ఉన్న 7 ఎకరాల భూమిలో తమ భాగం 3 ఎకరాలని...ఇందులో 9 గుంటల భూమిని మల్‌రెడ్డి రాంరెడ్డికి అమ్మానని తెలిపారు. బైట్: కృష్ణయ్య, నిందితుడు సురేష్ తండ్రి ఎండ్ వాయిస్ భూ వివాదమే తహశీల్దార్ హత్యకు దారి తీయగా, నిందితుడు సురేష్ కూడా మృతి చెందటంతో బంధువులు ఆరోపిస్తున్నట్లు సురేష్ ను ఈ హత్య కు ఎవరైనా ఉసిగొల్పారా...లేక ఉద్దేశ పూర్వకంగానే హత్య చేశాడా అనే కోణాల్లో పోలీసుల దర్యప్తు చేస్తున్నారు. సురేష్ కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసుల అతను ఎవరెవరితో మాట్లాడాడు అనే దానిపై దృష్టి పెట్టారు. ఓవర్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.