ETV Bharat / state

BJP Mrityunjaya Homam : రేపు రాష్ట్రవ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు

BJP Mrityunjaya Homam : ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ హోమాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

bjp protest
bjp protest
author img

By

Published : Jan 9, 2022, 12:19 PM IST

BJP Mrityunjaya Homam : ప్రధాన మంత్రి మోదీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ.. భాజపా రాష్ట్ర శాఖ మృత్యుంజయ హోమం నిర్వహించాలని తలపెట్టింది. పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో అందోళనలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

సోమవారం ఉదయం 11నుంచి ఒంటి గంట వరకు హోమం నిర్వహించాలని బండి సంజయ్‌ పార్టీశ్రేణులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో తాను పాల్గొంటున్నట్లు సంజయ్‌ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

పంజాబ్ ఘటనను నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా భాజపా నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఇదీ చూడండి: MP Letter to CM KCR: సీఎం కేసీఆర్​కు భాజపా ఎంపీ లేఖ.. అందులో ఏముందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.