కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలంటూ హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని హనుమాన్ దేవాలయంలో మృత్యుంజయ, ధన్వంతరి, సుదర్శన హోమాలు నిర్వహించారు. లోక కల్యాణార్థం హోమాలు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడం వల్ల జనజీవనం అతలాకుతలం అవుతోందన్నారు.
ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని... అత్యవసరమైతేనే బయటకు రావాలని, మాస్కులు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దీప్తి రెడ్డి, ఛైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, ధర్మకర్తలు మల్లేశ్ గౌడ్, నర్రె శ్రీనివాస్, చలమల యాదిరెడ్డి, అనిత, రాజు గౌడ్, భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆ రోగులు ఆక్సిజన్ అందక చనిపోలేదు: డీఎంఈ రమేశ్ రెడ్డి