తెరాస(trs) ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎంపీ ఉత్తమ్ కుమార్(uttamkumar reddy) రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వడ్డీలు ఇవ్వకపోగా... మహిళల నుంచి వసూలు చేయాలని ఒత్తిడి పెంచుతోందని విమర్శించారు. చెల్లించని చోట అధికారులను సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. మహిళా సాధికారతకు(women empowerment) కాంగ్రెస్(congress party) పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చిందని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు.
మహిళల్ని తెరాస మోసం చేస్తోందని ఆరోపించారు. అభయ హస్తంలో పింఛన్లు ఇవ్వకపోగా... మహిళలు కట్టిన రూ.1,250 కోట్లు కూడా వెనక్కి ఇవ్వడం లేదని విమర్శించారు. సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల సభ్యులు చనిపోతే కాంగ్రెస్ హయాంలో రూ.25 వేలు ఇచ్చారని... ఇప్పుడు రూపాయి కూడా ఇవ్వడం లేదని అన్నారు.
కేసీఆర్ సీఎం(cm kcr) అయ్యాక వడ్డీలేని రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. కానీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణం ఇవ్వలేదు. రూ.3,000 కోట్లు మహిళా సంఘాలకు బకాయి పడింది. ఒక్కో మహిళకు రూ.5 నుంచి 10 వేలు బాకీ ఉన్నారు. కానీ హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఉన్నాయని రూ.50 కోట్లు విడుదల చేశారు.
-ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ
ఇదీ చదవండి: YADADRI: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. కోలాహలంగా ఆలయ పరిసరాలు