స్వేచ్ఛ కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ అన్ని వర్గాలు ఏకమై ఉద్యమం చేయాల్సి వస్తోందని ఎంపీ రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సరూర్నగర్లో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమరభేరి సభలో పాల్గొన్న రేవంత్రెడ్డి.... ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం తమ అజెండాలో లేందంటున్న సీఎం కేసీఆర్... మరి ప్రైవేటుపరం చేస్తానంటున్న అంశం ఉందా అని నిలదీశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎందుకు అసాధ్యమో చెప్పాలన్నారు. సభ అనుమతుల కోసం కూడా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని చెప్పారు. కార్మికులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తామంతా తోడుగా ఉన్నామని రేవంత్రెడ్డి భరోసానిచ్చారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... కోర్టుకు నివేదికపై సమాలోచనలు!