క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తనపై అక్రమ కేసులు పెట్టడం సహజమని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. గోపనపల్లి భూ ఆరోపణలపై రేవంత్రెడ్డి స్పందించారు. అధికారులతో పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు.
2005లో తాను ఆస్తులను కొంటే 1978 సంవత్సరంలో రికార్డులు తారుమారు చేసినట్లు రావడం ఏంటని అన్నారు. ఆ సమయంలో తనకు గోపన్పల్లి ఎక్కడ ఉందో కూడా తెలియదనన్నారు. భూ అక్రమాలపై నిజానిజాలను కోర్టే తేలుస్తుందని ఆయన వెల్లడించారు.