రాజీవ్ స్వగృహ గృహాలను అర్హులకు కేటాయించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని... మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 'పట్నం గోస' కార్యక్రమంలో భాగంగా... రెండో రోజు ఎల్బీనగర్‌లో ఆయన పర్యటించారు.
బండ్లగూడలోని రాజీవ్ స్వగృహాలను పరిశీలించారు. 3వేల ఇళ్లను కేటాయించకుండా ఉన్నారంటూ రాజీవ్ స్వగృహ ఎండీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మార్చి 15లోగా చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా పోరాటం చేస్తామని రేవంత్ హెచ్చరించారు.
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని... పేదవారు అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్లు కేటాయించే వరకు ప్రభుత్వమే నెలకు ఐదువేలు కిరాయి కింద చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: 'ఒక్కరు కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా...'