ETV Bharat / state

పరాయి పార్టీ నేతలపై ప్రేమ: రేవంత్​ రెడ్డి - mp revanth reddy fires on bjp mim

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దర్శకత్వంలో భాజపా, ఎంఐఎం నడుచుకుంటున్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను భాజపా-ఎంఐఎంలు తుచ్ఛ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.

mp revanth reddy comment on bjp Love on other party leaders
పరాయి పార్టీ నేతలపై ప్రేమ: రేవంత్​ రెడ్డి
author img

By

Published : Nov 26, 2020, 1:13 PM IST

Updated : Nov 26, 2020, 3:37 PM IST

సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్​లను గౌరవించుకోలేని భాజపా.. పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోయడం ఏమిటని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజంగా పీవీ, ఎన్టీఆర్​లపై భాజపాకు ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈనెల 29న హైదరాబాద్ వస్తున్న అమిత్​ షా.. ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలన్నారు. ప్రతిరోజు రాత్రి బండి సంజయ్, అరవింద్–అసద్, అక్బర్​ల మధ్య ఫోన్ సంభాషణ నడుస్తుందన్నారు. ఇందుకు అమిత్ షా సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాత్రి పూట అంతా కలిసి స్ప్రిప్ట్​ తయారు చేసుకోవడం.. ఉదయం సురభి నాటకానికి తెర లేపడం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా భాజపా ఉచ్ఛరించదని దుయ్య బట్టారు. రాష్ట్ర ప్రజలు ఇలాంటి ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : సీఎం కేసీఆర్​ వెంటనే స్పందించాలి: బండి

Last Updated : Nov 26, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.