ETV Bharat / state

RRR Letter to Jagan: పోలీసు కంప్లైంట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ నియామకంపై లేఖ - ముఖ్యమంత్రి జగన్ రఘురామ లేఖ

నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్​కు మరో లేఖ రాశారు. ఏపీ పోలీసు కంప్లైంట్స్‌ అథారిటీ ఛైర్మన్​గా హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమించడానికి నిబంధనలను సవరించారని అందులో పేర్కొన్నారు. చట్టబద్ధమైన పోస్టులో వయసు నిబంధనను సడలించడం సరికాదన్నారు.

rrr letter to a jagan
RRR Letter to Jagan: పోలీసు కంప్లైంట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ నియామకంపై లేఖ
author img

By

Published : Jun 24, 2021, 10:55 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో లేఖలు రాస్తున్న ఎంపీ.. హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ వి.కనగరాజ్‌ను పీసీఏ ఛైర్మన్‌గా నియమించడాన్ని అందులో ప్రస్తావించారు.

జీవో నెం. 125లో పేర్కొన్న అంశాలను ఏపీ ప్రభుత్వం ముందుగా పరిశీలించాలన్న ఆయన.. 65 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు మాత్రమే ఆ పదవికి అర్హులని పేర్కొన్నారు. జస్టిస్‌ కనగరాజ్‌ కోసం ఓ ప్రణాళిక ప్రకారమే నిబంధన సవరించారని చెప్పారు. 2020 ఏప్రిల్‌లో ఎస్‌ఈసీగా కనగరాజ్‌ నియామకాన్ని నెలలోనే హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. చట్టబద్ధమైన పోస్టులో వయస్సు రాయితీతో నియమించడం తగదని ప్రభుత్వానికి సూచించారు.

ఇదీ చూడండి: నేడు కశ్మీర్ నేతలతో మోదీ కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.