ETV Bharat / state

'7 రోజుల్లో చేస్తానన్నారు.. 765 రోజులైంది.. మాట నిలబెట్టుకోండి' - ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ

కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామంటూ.. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని.. ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్​కు ఎంపీ రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. ఆ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు.

raghurama
raghurama
author img

By

Published : Jun 11, 2021, 11:00 AM IST

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. సీపీఎస్‌ విధానం రద్దు అంశంపై లేఖలో ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రలో... సీపీఎస్‌ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చారని జగన్​కు గుర్తు చేశారు. ఆ హామీకి నాడు ఉద్యోగుల నుంచి మద్దతు లభించిందని చెప్పారు.

" అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లో హామీ నెరవేరుస్తానన్నారు. అధికారంలోకి వచ్చి 765 రోజులు దాటినా హామీ నెరవేరలేదు. సీపీఎస్‌ విధానం రద్దు చేస్తానన్న హామీ వెంటనే నిలబెట్టుకోవాలి" అని లేఖలో రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.