ఈ రోజు జీరో అవర్‌లో భాగంగా లోక్‌సభలో రాష్ట్రంలో జరిగిన శ్రీశైలం ప్రమాద ఘటనపైన ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తావించటాన్ని తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు అడ్డుకున్నారు. సీబీఐ విచారణ కావాలన్న రేవంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అనుకోకుండా సంభవించిన ఒక ప్రమాద ఘటనలో విద్యుత్ ఉద్యోగులు తమ ప్రాణాలకు తెగించి వీర సైనికుల వలే పోరాడితే... ఎంపీ రేవంత్ అసంబద్ధంగా మాట్లాడటం సరికాదని ఎంపీ నామ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాద ఘటన బాధితులను అన్ని విధాలుగా సీఎం కేసీఆర్ ఆదుకుంటుంటే ... అసత్య ఆరోపణలు ప్రభుత్వంపైన చేయటం సరికాదన్నారు. ఈ విషయమై నామ మాటలకు స్పందించి స్పీకర్ వెంటనే రేవంత్ రెడ్డి మైక్ కట్ చేశారు.
ఇవీ చూడండి: సీతారామ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం ఆరా