ETV Bharat / state

సర్వేల ఆధారంగానే హంగ్ వస్తుందని చెప్పా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

author img

By

Published : Feb 14, 2023, 7:48 PM IST

Updated : Feb 14, 2023, 8:06 PM IST

KomatiReddy Venkatreddy Interesting Comments: వరంగల్​లో రాహుల్​గాంధీ చెప్పినట్లుగానే ఏ పార్టీతో మాకు పొత్తు ఉండదని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. నేనేమీ గందరగోళంలో లేనని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సర్వేల ఆధారంగానే హంగ్ వస్తుందని చెప్పినట్లు వివరించారు. తానేమి తప్పుగా మాట్లాడలేదని, కాంగ్రెస్​లో చిన్నపిల్లలు కూడా విమర్శలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

KomatiReddy Venkatreddy
KomatiReddy Venkatreddy
సర్వేల ఆధారంగానే హంగ్ వస్తుందని చెప్పా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

KomatiReddy Venkatreddy Interesting Comments: వరంగల్ సభలో రాహుల్​గాంధీ చెప్పినట్లుగానే ఏ పార్టీతో మాకు పొత్తు ఉండదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్​గాంధీ మాటలకే తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

తాను గందరగోళంలో ఏమి లేనని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సర్వేల ఆధారంగానే హంగ్ వస్తుందని చెప్పినట్లు వివరించారు. తానేమి తప్పుగా మాట్లాడలేదని, తనపై చిన్నపిల్లలు కూడా విమర్శలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హంగ్ ఏర్పడినప్పుడు సెక్యులర్ భావాలున్న పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్​రావు ఠాక్రే స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కొట్టిపారేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఏమి వ్యాఖ్యలు చూడలేదన్నారు.

ఇంతకీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు విషయం తెలిసిందే. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌లో అందరం కష్టపడితే 40-50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి తెలిపారు. 'కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం మాత్రం ఖాయం. పార్టీలోని ఏ ఒక్కరితో కాంగ్రెస్‌కు అన్ని సీట్లు కూడా రావు. నేను గెలిపిస్తా అంటే.. మిగిలినవారు ఇంట్లోనే ఉంటారు. నేను స్టార్‌ క్యాంపెయినర్‌ను.. ఒక్క జిల్లాలోనే ఎందుకు తిరుగుతా? మార్చి మొదటి వారం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తాను. పాదయాత్ర ఒక్కటే కాదు.. బైకుపై కూడా పర్యటిస్తా.

పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై పార్టీ అనుమతి తీసుకుంటాను' అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాన పార్టీలు స్పందిస్తున్నాయి. బీజేపీ సైతం ఈ వ్యాఖ్యలపై స్పందించి, కాంగ్రెస్ తనంతట తానే ఎన్నికల బరిలోంచి తప్పుకున్నట్లే అని పేర్కొంది.

'నేనేమీ గందరగోళంలో లేను. సామాజిక మాధ్యమాల్లో సర్వేలు చూసి హంగ్ వస్తుందని చెప్పా. కాంగ్రెస్‌లో చిన్నపిల్లలు కూడా నన్ను విమర్శిస్తున్నారు. రాహుల్‌గాంధీ చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నా. వరంగల్‌ సభలో చెప్పినట్లు మాకు ఏ పార్టీతోనూ పొత్తుండదు. నేనేం తప్పుగా మాట్లాడలేదు, రాద్ధాంతం ఏం లేదు. సెక్యులర్ భావాలున్న పార్టీలతో పొత్తు ఉంటుందని అన్నాను. బీజేపీ వాళ్లు నా వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారు. నా మీద చర్యలు తీసుకోడానికి నేను ఏ కమిటీల్లోను లేను కదా. పీఏసీ కమిటీలో సభ్యుడిని అయ్యాక గాంధీభవన్‌కు వస్తా'. -కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.