ETV Bharat / state

కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ కోమటిరెడ్డి

కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు లేఖ రాశారు.

MP Komatireddy Venkat Reddy said that a railway station should be set up in Komuravelli
'కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి'
author img

By

Published : Feb 10, 2021, 4:57 AM IST

కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైల్వే లైన్​లో భాగంగా.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు ఆయన లేఖ రాశారు.

కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి నిత్యం హైదరాబాద్​తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారని తెలిపారు. ఈ లైన్ ఏర్పాటు వల్ల లక్షలాది మంది భక్తులకు ప్రయాణం సులువు అవుతుందన్నారు. దేశంలో గొప్ప పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందని తెలిపారు. అధికారులు ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటుకు స్థలం పరిశీలించి పనులు మొదలుపెట్టాలని కోరిన ఎంపీ.. రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఇదీ చదవండి:పార్టీ లోక్​సభ సభ్యులకు భాజపా విప్​ జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.