MP Venkat Reddy Met PM Modi : సాధారణ ఎన్నికలకు నెల ముందు భావి కార్యాచరణ ప్రకటిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్గొండ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి అనేది ఎన్నికలప్పుడే తెలుస్తుందన్నారు. ప్రధాని మోదీని శుక్రవారం ఆయన కలిశారు. 20 నిమిషాలకు పైగా వారి భేటీ సాగింది. అనంతరం తన నివాసంలో ఎంపీ.. విలేకరులతో మాట్లాడారు. నమామి గంగా మాదిరి మూసీ ప్రక్షాళన చేపట్టాలని ప్రధానిని కోరగా.. కమిటీ వేస్తానని మోదీ హామీ ఇచ్చారన్నారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ, జనగామ-భువనగిరిల మధ్య ఎంఎంటీఎస్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెంకట్‌రెడ్డి చెప్పారు. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.90 కోట్లు చెల్లించాలని కోరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ అభ్యర్థిస్తానని తెలిపారు. కేసీఆర్ బంధువుకు నైనీ కోల్‌బ్లాక్ టెండర్ కట్టబెట్టేందుకు జాయింట్ వెంచర్ అనే క్లాజ్ తొలగించి చేసిన యత్నాలను ఎంపీగా అడ్డుకొని రూ.30 వేల కోట్లు దేశానికి, సింగరేణికి మిగల్చటంపై ప్రధాని తనను అభినందించారని కోమటిరెడ్డి చెప్పారు .
ఇవీ చదవండి: మాటల్లో తెలంగాణ.. రాతల్లో ఆంధ్రప్రదేశ్..
యుద్ధభూమిలో పర్యటక శోభ.. 'తవాంగ్'కు తరలివస్తున్న టూరిస్ట్‌లు