రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం దుబాయ్‌లో వైభవంగా నిర్వహించారు. పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజాతో నిశ్చితార్థం ఖరారైన సమయం నుంచి సీఎం రమేష్ ఈ వేడుక నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దుబాయ్‌లోని వాల్డాఫ్ర్ అస్టోరియా, రసాల్ ఖైమాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహానికి ఏ మాత్రం తీసిపోకుండా నిశ్చితార్ధం నిర్వహించారు.
కుమారుడి ఎంగేజ్మెంట్లో సీఎం రమేష్ జోష్‌గా కనిపించారు. పాటలకు స్టెప్పులతో అదరగొట్టారు.
ఇదీ చదవండి: ఘనంగా "కథ-2018” పుస్తకావిష్కరణ కార్యక్రమం