ETV Bharat / state

విషమంగానే తారకరత్న ఆరోగ్యపరిస్థితి.. విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు - తారకరత్న హెల్త్ బులిటెన్

THARAKARATNA HEALTH UPDATES: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వారం రోజులు గడిచినా.. విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జనవరి 27 నుంచి ఈరోజు వరకూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు ఆయనకు ప్రత్యేక వైద్య బృందంతో చికిత్సను అందిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి బులెటిన్ విడుదల చేస్తున్నారు.

THARAKARATNA
THARAKARATNA
author img

By

Published : Feb 3, 2023, 8:13 PM IST

THARAKARATNA HEALTH UPDATES: బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో గత ఏడు రోజులుగా తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ.. తారకరత్న వద్దే ఉంటూ నిత్యం డాక్టర్లలను సంప్రదిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స చేశారు. స్కాన్ రిపోర్టర్ వచ్చిన తర్వాత డాక్టర్‌ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు.

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో గత నెల 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కొద్ది దూరం నడిచిన అనంతరం గుండెపోటుకు గురయ్యారు. అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హూటాహూటిన కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి గత ఏడు రోజులుగా చికిత్సను అందిస్తున్నారు.

మరోపక్క పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న త్వరగా కోలుకోవాలని రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురానికి చెందిన టీడీపీ నాయకులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోని వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ.. 101 కొబ్బరి కాయలు కొట్టారు. ఆసుపత్రిలో తారకరత్నను చూసిన హిందూపూర్ పార్లమెంటు కార్యదర్శి అంబికా లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. పూజా కార్యక్రమంలో ఖాదీ బోర్డ్ మాజీ సభ్యులు దేవంగా పాపన్నతో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

''ఈరోజు ఆసుపత్రి వైద్యులు తారకరత్న మెదడుకు శస్త్ర చికిత్స చేశారు. తారకరత్న కచ్చితంగా కోలుకుంటారు. మొదటి రోజు నుంచి ఈరోజు వరకూ కూడా బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నను చూసుకుంటున్నారు. మెదడుకు సంబంధించిన స్కానింగ్ తీశారు. స్కాన్ రిపోర్టులను బట్టి తదుపరి చికిత్సలు చేయనున్నట్టు డాక్టర్లు చెప్పారు. పరిస్థితిని బట్టి తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు.''-అంబికా లక్ష్మీ నారాయణ, హిందూపూర్ పార్లమెంటు కార్యదర్శి

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.