ETV Bharat / state

ఇంత పెద్ద కింగ్​ కోబ్రానా.. ఎక్కడ అసలు?

14 Feets King Cobra in ap: రోజూలాగే ఇవాళ కూడా పామాయిల్​ తోటలో పనికి వెళ్లారు. అక్కడకు వెళ్లిన కూలీలు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. 14 అడుగుల కింగ్​కోబ్రాను చూసి పరుగులు తీశారు. అనంతరం స్నేక్‌ క్యాచర్స్​కు సమాచారమివ్వగా.. పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

king cobra
కింగ్​ కోబ్రా
author img

By

Published : Oct 19, 2022, 5:11 PM IST

14 Feets King Cobra in ap: ప్రపంచంలోనే విషపూరిత పాముల్లో అతిపెద్దదైన కింగ్ కోబ్రా అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో కలకలం రేపింది. పామాయిల్ తోటలో కూలీలు గెలలు కోస్తుండగా కనిపించింది. భారీ పామును చూసిన కూలీలు భయభ్రాంతులతో పరుగులు తీశారు. స్నేక్​ క్యాచర్స్​కు సమాచారం అందించారు. సభ్యులు వెంకటేష్, మూర్తి సంఘటనాస్థలానికి చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి.. కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. పాము పొడవు 14 అడుగుల వరకు ఉండొచ్చని తెలిపారు.

ఈ కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. పర్యావరణ సమతుల్యత కోసం వీటిని రక్షించుకోవాలని వన్యప్రాణి సంరక్షణ సభ్యులు సూచించారు. బంధించిన కింగ్ కోబ్రాను వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.

14 అడుగుల కింగ్​ కోబ్రా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.