గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో బుధవారం 3,500 పోస్టర్లు, బ్యానర్లు తొలగించినట్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి నోడల్ అధికారి విశ్వజిత్ తెలిపారు. నోటిపికేషన్ వెలువడిన తర్వాత నుంచి రెండు రోజుల్లో మొత్తం 7,500 ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించామన్నారు.
పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని విశ్వజిత్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రహరీ, ప్రధాన రహదారుల వెంట ఉన్న వాటిని తొలగించామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు సర్కిళ్లవారీగా నిఘా బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని వివరించారు.
ఇదీ చదవండి: రాజకీయం రసవత్తరం... గ్రేటర్లో వలసల పర్వం