ETV Bharat / state

భాగ్యనగరంలో నలుదిశలా నిఘా కళ్ల ఏర్పాటుకు చర్యలు - More surveillance for Hyderabad news

హైదరాబాద్​ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిఘా నేత్రాల ఏర్పాటుకు సర్కారు నడుం బిగించింది. మంత్రి కేటీఆర్​ ఆదేశాలతో యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. వీటిని అమర్చే పనులను ప్రారంభించి, నెలలోగా పూర్తి చేయాలని అధికారులకు బల్దియా కమిషనర్‌ డీఎస్‌.లోకేశ్​ ‌కుమార్‌ స్పష్టం చేశారు.

cc cameras to be installed
భాగ్యనగరంలో నలుదిశలా నిఘా కళ్ల ఏర్పాటుకు చర్యలు
author img

By

Published : Oct 9, 2020, 8:13 AM IST

రాష్ట్ర రాజధాని నగరాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సర్కారు నడుం బిగించింది. బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) కేంద్రంగా ఐటీ, ఫార్మా, సేవా రంగాలు విస్తరిస్తున్నందున హెచ్‌ఎండీఏ-జీహెచ్‌ఎంసీ పరిధుల్లో పెద్దఎత్తున నిఘా నేత్రాలను ఏర్పాటుచేయాలన్న మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. జోనల్‌ కమిషనర్లు, ఇతర విభాగాధిపతులు యుద్ధప్రాతిపదికన వీటిని అమర్చే పనులను ప్రారంభించి, నెలలోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రాంతాల వారీగా బాధ్యతను వేర్వేరు విభాగాలకు అప్పగించారు.

యుద్ధ ప్రాతిపదికన

  • ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేనిచోట వెంటనే బిగించాలని హెచ్‌ఎండీఏ సైతం ఆదేశాలిచ్చింది.

గ్రేటర్‌ మొతాన్ని పూర్తి స్థాయి పౌర భద్రత ఉన్న నగరంగా తీర్చిదిద్దాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. నిఘా నేత్రాల పరిధిలో లేని ప్రాంతాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన అక్కడా బిగించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ యంత్రాంగం చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ(హెచ్‌ఎంఆర్‌ఎల్‌), దక్షిణ మధ్య రైల్వే, టీఎస్‌ఆర్టీసీ, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌(హెచ్‌జీసీఎల్‌), సెంట్రల్‌ పవర్‌ డిస్కం(టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌), మార్కెటింగ్‌, ఇరిగేషన్‌ తదితర శాఖలు, విభాగాలకు మార్గనిర్దేశం చేశారు.

సీసీ కెమెరాలు ఎక్కడెక్కడంటే..

  • గుర్తించిన అన్ని మురికివాడలు, రెండు పడకల ఇళ్ల సముదాయాలు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు
  • మెట్రో స్టేషన్లతోపాటు ఎంపిక చేసిన పిల్లర్లు, ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లు, బస్‌ డిపోలు, బస్సులు, బస్‌ షెల్టర్లు, బస్‌ బేలు
  • ప్రార్థన మందిరాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు
  • చెరువులు, పార్కుల ప్రవేశద్వారాలు
  • ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ ఛేంజ్‌లు, వాహనాల అండర్‌ పాస్‌లు, ప్రధాన రోడ్డు మార్గాలు, లింకురోడ్లు, ఐటీ పార్కులు, ఐటీ సంస్థలు
  • 17 చెత్త తరలింపు కేంద్రాలు, నిరాశ్రయుల కేంద్రాలు, అనాథ ఆశ్రమాలు, సంక్షేమ వసతిగృహాలు, పీజీ హాస్టళ్లు, పెట్రోల్‌ బంకులు
  • మార్కెట్లు, రైతు బజార్లు, ఇతర చిల్లర దుకాణాలు, స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్లు, కాలనీ స్థాయి విద్యుత్తు కార్యాలయాలు
  • అవసరమైన ప్రాంతాల్లోని వీధి దీపాల స్తంభాలు.

తప్పనిసరి చేయాలి..

టీఎస్‌బీపాస్‌ కింద ఇచ్చే నిర్మాణ అనుమతులతోపాటు ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌ షిప్‌ ప్రాజెక్టు కింద ఇచ్చే అనుమతుల విషయంలో సీసీకెమెరాల ఏర్పాటు అంశం తప్పనిసరి చేయాలని.. 600 చదరపు గజాలకు మించి జరిగే నిర్మాణాలు, లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లు, దుకాణాలకూ ఈ నిబంధన వర్తింపజేయాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ సంబంధిత శాఖలను ఆదేశించారు. ఓలా, ఉబెర్‌ సంస్థల నిఘా నేత్రాల సమాచారాన్నీ సేకరించి, వాటిని పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు.

ఇదీ చదవండిః భాగ్యనగరిలో 10లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.