ETV Bharat / state

Money is changing hands through Hawala in Hyderabad : ఇటు ఎన్నికల జోరు.. అటు ప్రపంచకప్​ హోరు.. హవాలా మార్గంలో భారీగా చేతులు మారుతున్న సొమ్ము - ఎన్నికలకు హవాలా డబ్బులు పంపుతున్న బెట్టింగ్​

Money is changing hands through Hawala in Hyderabad : ఇటు క్రికెట్​ ప్రపంచకప్​.. మరోవైపు ఎన్నికల జోరుతో బెట్టింగ్​ రాయుళ్లకు రెండు పండుగలు ఒకేసారి వచ్చినట్లు అయింది. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నగరంలో పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము చేతులు మారుతుంది. దీనిపై ఇంటెలిజెన్స్​ ఓ కన్నేసింది. క్రికెట్​ పందేలపై నిఘా ఉంచుతూ.. హవాలా వ్యాపారులు, దళారుల కదలికలపై పోలీసు యంత్రాంగం దృష్టిని కేంద్రీకరించింది.

Cricket Betting Gangs
Cricket Betting Gangs in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 1:44 PM IST

Money is changing hands through Hawala in Hyderabad : ఒకవైపు ప్రపంచకప్​ క్రికెట్​ పండుగ(World Cup 2023).. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల జోరు ఉండటంతో బెట్టింగ్​ ముఠాలు(Cricket Betting gangs) రంగంలోకి దిగాయి. ఒకేసారి రెండు అవకాశాలు రావడంతో బెట్టింగ్​ మాయగాళ్లు.. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. దీంతో ఎక్కువ మొత్తంలోనే డబ్బు హవాలా మార్గంలో చేతులు మారుతోందని ఇంటెలిజెన్స్​ చెబుతున్నాయి. దేశంలో ఎక్కడ బెట్టింగ్​ జరిగినా ఆ మూలాలు హైదరాబాద్​లో ఉంటాయని.. ఈ వారం వ్యవధిలోనే దాదాపు రూ.8 కోట్ల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. క్రికెట్​ పందేలపై నిఘా ఉంచుతూ.. హవాలా వ్యాపారులు, దళారుల కదలికలపై దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపారు.

యాప్​లు.. అంతర్రాష్ట్ర ముఠాలు, దేశ, విదేశాల్లో ఏ మూల క్రికెట్​ పోటీలు జరిగినా హైదరాబాద్​ నగరం కేంద్రంగా పందేలు జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్​ ముఠాలను అరెస్టు చేస్తున్న నగరం పరిధిలోని మూడు పోలీస్​ కమిషనరేట్లలో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇటీవల జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లపై బెట్టింగ్​లకు పాల్పడిన 10 మంది పంటర్లను సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద రూ. కోటి విలువైన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచకప్​ పుణ్యమా అని.. బెట్టింగ్​ ముఠాలకు పంట పడుతున్నాయి.

IPL betting gang arrested: ఐపీఎల్‌ బెట్టింగ్ ముఠా అరెస్టు... రూ.93లక్షలు సీజ్​

World Cup Betting in Hyderabad : ప్రధాన బుకీలు పందెపురాయుళ్లుకు ఆన్​లైన్​, యాప్​, వాట్సాప్​ గ్రూపులతో దగ్గర అవుతున్నారు. గుజరాత్​, ఆంధ్రప్రదేశ్​, రాజస్థాన్​, ఉత్తరప్రదేశ్​కు చెందిన ముఠాలు ఇప్పటికే నగరంలో తిష్ట వేసినట్లు విశ్వసనీయ సమాచారం. పందాళ్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులను బుకీలు పంటర్లుగా వాడుకుంటున్నారు. ప్రతి మ్యాచ్​కు 10 నుంచి 20 శాతం వరకు కమీషన్​ ఇస్తామని ఆశచూపుతున్నారని ఇంటెలిజెన్స్​ చెబుతున్నాయి. ప్రస్తుతం నగరంలో నాలుగైదు అంతర్రాష్ట్ర ముఠాలు పాగా వేసినట్లు సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు.

గోదాములే.. హవాలా అడ్డాలు.. : ప్రధాన పార్టీలు రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు ఉన్న అన్ని మార్గాలను ఎంచుకున్నాయి. ఎన్నికల ప్రచారం నుంచి ఓటర్లను ఆకట్టుకునేంత వరకు.. అవసరమైన అన్ని ఆర్థిక వనరులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. వారం రోజుల క్రితం జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో డబ్బుల పంపిణీ, హవాలా సొమ్ముపైనే నిఘా ఉంచాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.

Political Parties that Channeled Hawala Money to Hyderabad : ఈ నేపథ్యంలో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల నుంచి హవాలా మార్గంలో నగరానికి చేరుకున్న నగదును గోదాములు, పాడుబడిన భవనాలు, దుకాణాల్లో భద్రపరుస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా బేగంబజార్​, బార్కస్​, షాహినాయత్​గంజ్​, చార్మినార్​ ప్రాంతాలకే ఈ దందా పరిమితమైంది. కానీ ఈసారి సికింద్రాబాద్​కు పాకింది. ఎన్నికలకు మూడు నెలల ముందునే హవాలా డబ్బు నగరానికి చేరుకుందని పోలీసులు తెలుపుతున్నారు. నిత్యావసర వస్తువులు, ఇనుము హోల్​సేల్​, దుకాణాల్లోనే హవాలా సొమ్ము ఉందని పోలీసు అధికారి తెలిపారు.

IPL Betting Gang Arrested : IPL​ బెట్టింగ్​ ముఠా అరెస్ట్​.. రూ.1.84 కోట్లు స్వాధీనం

రూ.4 కోట్ల హవాలా డబ్బు పట్టివేత.. ముగ్గురు అరెస్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.