రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఒకటిరెండు చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఏర్పడిన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి... ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఉత్తర కోస్తా ఒడిస్సా దగ్గర చాంద్ బలీకి పశ్చిమ వాయువ్య దిశగా 20కిమీ దూరంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాగల 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిస్సా, ఉత్తర ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ మీదుగా పయనించే అవకాశలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. తదుపరి 24 గంటలలో తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈ రోజు ములుగు, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీమ్, జగిత్యాల ఆదిలాబాద్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ సంచాలకులు తెలిపారు.
ఇదీ చూడండి: Gazette On KRMB, GRMB: బోర్డుల పరిధిపై కార్యాచరణ వేగవంతం.. ఇంజినీర్ల కేటాయింపు