దిల్సుఖ్నగర్లోని సత్యనారాయణ స్వామి ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ 188వ ఉచిత వివాహం జరిగింది. మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు, మానవతా వాది మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా.. నరేష్, దివ్య వధూవరులకు ఉచిత వివాహం జరిపించారు.
ఆర్థికంగా ఇబ్బందుల ఉండి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు ఎవరైనా 15 రోజుల ముందు సంప్రదించాలని ఉపేందర్ గుప్తా అన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా ఉచిత వివాహం జరిపిస్తామన్నారు.
నిరుపేదలను ఆదుకోవడానికి మొగుళ్లపల్లి యువసేన ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. పేద జంటలకు వివాహాలు జరిపించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తామన్నారు.
ఇదీ చూడండి: ప్రగతి భవన్ వద్ద నర్సింగ్ అభ్యర్థుల ఆందోళన