ETV Bharat / state

Modi Enemy Of Telangana: ట్రెండింగ్​లో 'మోదీ ఎనిమీ ఆఫ్‌ తెలంగాణ' - Twitter trending

Modi Enemy Of Telangana: పార్లమెంట్​లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగుతోంది. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్​లు తీవ్రస్థాయిలో నిరసన వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెరాస మోదీ ఎనిమీ ఆఫ్‌ తెలంగాణ అనే హ్యాష్​ట్యాగ్​ను ట్విట్టర్​లో ట్రెండ్​ చేసింది.

Modi
Modi
author img

By

Published : Feb 9, 2022, 3:36 PM IST

Modi Enemy Of Telangana: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తెరాస మద్దతుదారులు నిరసనతో హోరెత్తిస్తున్నారు. 'మోదీ ఎనిమీ ఆఫ్‌ తెలంగాణ' పేరుతో ట్వీటర్‌లో హ్యాష్‌టాగ్‌లు పెడుతున్నారు. తెరాస మద్దతుదారులు గంటలోపే 25 వేలకు పైగా ట్వీట్లు చేశారు. తెరాస మద్దతుదారుల ట్వీట్లు ట్విట్టర్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉన్నాయి. రాజకీయాంశాల్లో తొలిస్థానంలో నిలిచాయి.

నిరసనలు...

ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస శ్రేణులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా నిరసన తెలపాలంటూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా నేతలు రోడ్డెక్కారు. ప్రధాని దిష్టిబొమ్మ దహనాలు చేస్తూ నినాదాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రధాని మాట్లాడారని నేతలు మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: TRS Protest : ఇవాళ నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు కేటీఆర్‌ పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.