క్రైస్తవ సోదరులంతా ఆనందంగా క్రిస్‌మస్ వేడుకలను జరుపుకోవాలనే ఉద్దేశంతో కానుకలను పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్‌బోయగూడ ఫెలోనిమా చర్చి వద్ద పేద, మధ్య తరగతి కుటుంబాలకు పంపిణీ చేశారు.
కరోనా మహమ్మారి నుంచి క్రీస్తు లోకాన్ని రక్షించాలని... వైరస్ అంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రప్రభుత్వం క్రైస్తవ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అన్నారు. వరదల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. క్రిస్‌మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలియజేశారు.