ETV Bharat / state

కబ్జాదారుల నుంచి భూములను కాపాడండి: రాంచందర్​రావు - Mlc ramachanderrao latest comments

హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద తెలంగాణ భూపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ భూకబ్జా బాధితుల ధర్మాగ్రహ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రాంచందర్​రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్​రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

కబ్జాదారుల నుంచి భూములను కాపాడండి: రాంచందర్​రావు

author img

By

Published : Feb 10, 2021, 5:24 PM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను పరిరక్షించటంతో పాటు వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ రాంచందర్​రావు డిమాండ్ చేశారు. భూ కబ్జాదారుల నుంచి భూములను కాపాడాలని కోరారు. హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద తెలంగాణ భూపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ భూకబ్జా బాధితుల ధర్మాగ్రహ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.

భూ రికార్డులు సరిగా లేని కారణంగా వేలాది ఎకరాల భూములు భూ మాఫియా చేతుల్లోకి వెళ్లాయని రాంచందర్​రావు ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు గందరగోళంగా ఉండడం వల్ల వివాదాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేకంగా పనిచేస్తోందని సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసక అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్​లో మందుబాబు హల్​చల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.