రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు అబద్ధాలు, నిజాలకు మధ్య జరగబోతున్నాయని భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు. హైదరాబాద్‌ను తెరాస, మజ్లిస్ల నుంచి విముక్తి కల్గించాలని ఆయన నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 80 సీట్లకు పైగా గెలిచి మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భాజపా చేపట్టిన సర్వేలో తెరాస కార్పొరేటర్లకు నగర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిందన్నారు.
25 శాతం మంది కార్పొరేటర్లు అసమర్థులని తెరాస సమావేశంలో స్వయంగా కేటీఆరే చెప్పారని పేర్కొన్నారన్నారు. తెరాస కార్పొరేటర్లు పనిచేసి ఉంటే మోస్తారు వర్షానికే రెండు ప్రాణాలు పోయేవికాదన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో భారం మోపుతుందని ధ్వజమెత్తారు. లక్షాయాభై వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న సర్కారు ప్రకటనలో వాస్తవం లేదన్నారు.
ఇదీ చూడండి: తెరాస కార్పొరేటర్లలో ఆ 15 శాతం మంది ఎవరో అనే గుబులు!