ETV Bharat / state

మలక్​పేట్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలి: భాజపా ఎమ్మెల్సీ

దళితుల పట్ల అనుచితంగా మాట్లాడిన మలక్​పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్​ బలాలను అరెస్ట్​ చేయాలని అడిషనల్ సీపీ చౌహన్​కి భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు వినతిపత్రం అందజేశారు.

mlc ram chander rao handover the petition to additional cp against mla balala
మలక్​పేట్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలి: భాజపా ఎమ్మెల్సీ
author img

By

Published : May 28, 2020, 7:58 PM IST

మలక్​పేట్ మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే అహ్మద్​ బలాలను అరెస్ట్ చేయాలని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్​ చేశారు. అడిషనల్ సీపీ చౌహన్​కు వినతిపత్రం అందజేశారు. చాదర్​ఘాట్​లో ఓ దళిత యువతిపై ఎమ్మెల్యే బలాల అనుచరుడు అత్యాచారం చేశారని... ఈ ఘటనలో బాధితులపై బలాల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ ఆరోపించారు.

ఈనెల 22న ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైతే ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు. దళితులని చులకన భావంతో... దూషించిన ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలి. లేదంటే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా భాజపా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతాం. - రాంచందర్ రావు, ఎమ్మెల్సీ

ఇదీ చూడండి: నల్గొండ జిల్లాలో అటవీ అధికారులు బంధించిన చిరుత మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.