కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తుంటే... రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న ముందస్తు చర్యల వల్ల వైరస్ ప్రభావాన్ని నియంత్రించమని ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సరైన సమయంలో అధికారులను అప్రమత్తం చేస్తూ... ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు.
నాంపల్లి నియోజకవర్గంలోని చింతల బస్తీలో పేద ప్రజలకు, వలస కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు నవ్య శ్రీ సామాజిక సేవ సమితి ఆధ్వర్యంలో... ఎమ్మెల్సీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు, వలస కార్మికులను ఆదుకుంటున్న సేవ సమితి నాయకులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో బాధపడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు.
ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'