MLC Kavitha Respond on Revanth Reddy Tweet : గ్రూప్-2 అభ్యర్థిని ప్రవల్లిక ఆత్మహత్యపై రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై.. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి.. రాజకీయం చేయడం మీ విధానమా? అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకమ్మ చేస్తాం.. బాధను కూడా పంచుకుంటాం అంటూ కవిత రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం.. ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమంటూ విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల నిర్వహణకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు.
-
బతుకమ్మ చేస్తాము..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
బాధను కూడా పంచుకుంటాము..
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం...
ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ… https://t.co/ET9YmGPsPW pic.twitter.com/i5Alelsakh
">బతుకమ్మ చేస్తాము..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023
బాధను కూడా పంచుకుంటాము..
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం...
ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ… https://t.co/ET9YmGPsPW pic.twitter.com/i5Alelsakhబతుకమ్మ చేస్తాము..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023
బాధను కూడా పంచుకుంటాము..
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం...
ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ… https://t.co/ET9YmGPsPW pic.twitter.com/i5Alelsakh
MLC Kavitha Comments on Revanthreddy : తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా.. దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా ? అని ట్విటర్ వేదికగా కవిత ప్రశ్నించారు. చివరికి గ్రూప్-2ను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా.. మీరు కూడా ట్విటర్(X)లో డిమాండ్ చేసింది వాస్తవం కాదా అంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం మీకు, మీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య.. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి అంటూ ఘాటుగా బదులిచ్చారు. ప్రవల్లిక ఆత్మహత్యపై మీ ఆవేదన బూటకం.. మీ ఆందోళన నాటకమంటూ ధ్వజమెత్తారు.
Revanthreddy Fires on MLC Kavitha : ప్రవల్లిక ఆత్మహత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రేవంత్‌రెడ్డి.. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. గ్రూప్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం చేతకాని ఈ పాలకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ సంబురాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు.. గ్రూపు పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మఘోష వినపడటం లేదా అని ప్రశ్నించారు.
-
లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఎంపీగా ఓడిన మీకు ఆగమేఘాల పై ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా!?
— Revanth Reddy (@revanth_anumula) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమా!?
లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేక… https://t.co/HyB4mx78PY
">లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఎంపీగా ఓడిన మీకు ఆగమేఘాల పై ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా!?
— Revanth Reddy (@revanth_anumula) October 14, 2023
లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమా!?
లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేక… https://t.co/HyB4mx78PYలక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఎంపీగా ఓడిన మీకు ఆగమేఘాల పై ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా!?
— Revanth Reddy (@revanth_anumula) October 14, 2023
లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమా!?
లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేక… https://t.co/HyB4mx78PY
ఆడబిడ్డల హక్కులు కవిత దృష్టిలో రాజకీయ అంగడి సరుకే తప్ప.. రాజకీయ నినాదాలు తప్ప మానవీయ ఎజెండాలు కావని రేవంత్ వ్యాఖ్యానించారు. లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే ఎంపీగా ఓడిన మీకు ఆగమేఘాలపై ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా..? లేదా టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమా..? అంటూ విమర్శించారు. ఉత్త మాటలు… ఎదురు దాడులు కాదు… ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారో, ఎన్ని లక్షల ఖాళీలు ఉన్నాయో, ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.