దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శుక్రవారం సీబీఐ నోటీసులు ఇచ్చింది. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ నెల 6న విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. ‘‘ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో కానీ, దిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి’’ అని నోటీసుల్లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో కవిత ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆమెకు సంఘీభావంగా పెద్దఎత్తున తెరాస కార్యకర్తలు ముఖ్యమంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. సీబీఐ ఇచ్చిన నోటీసులపై సీఎం కేసీఆర్‌తో కవిత చర్చించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి..
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
దిల్లీ మద్యం కేసులో 36 మంది.. కల్వకుంట్ల కవిత సహా కీలక నేతలు..!